బీఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని నారాయణాఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎడ్లరేగడి తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ. పేదల సొంతింటి కలను సహకారం చేయడం కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.