సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలం లింగాపూర్ పంచాయతీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సోమవారం ప్రారంభించారు. MGNREGS నిధులతో నిర్మించిన ఈ రోడ్డు వల్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు కల్పించడమే లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రుక్మిణి హన్మాండ్లు,
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండరి రెడ్డి, కౌన్సిలర్ సుబుర్, నాగనాథ్ రెడ్డి పాల్గొన్నారు.