నాగల్ గిద్ద మండలం గూడూరు పరిధిలోని సింగూరు కాలువలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు మోటార్లను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శనివారం పరిశీలించారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం నుంచి ఈ నూతన మోటర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే చెప్పారు.