నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ, రిజిస్టర్లు, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు.