నారాయణఖేడ్: టీబీ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

3868చూసినవారు
పంచగామ గ్రామంలో మంగళవారం టీబీ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, రెండు వారాలకు పైగా దగ్గు, రాత్రిపూట జ్వరం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టీబీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్