నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎనిమిదో బాటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.