జర్నలిస్టుల సమస్యలపై ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లోని సమాచార శాఖ కార్యాలయం ముందు టీయుడబ్ల్యూఐ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్తారి వెంకటే తెలిపారు. ఈ మేరకు నారాయణఖేడ్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం టీయుడబ్ల్యూఐ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూఐ సభ్యులు పాల్గొన్నారు.