నారాయణఖేడ్ మండలం కాంజిపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మకు మంగళవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి రూ. 31,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సహాయం అందిందని, పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పండరెడ్డి, అశోక్, లక్ష్మణ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.