నారాయణఖేడ్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం: అభివృద్ధి పనులకు ఏకగ్రీవ ఆమోదం

2099చూసినవారు
నారాయణఖేడ్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం: అభివృద్ధి పనులకు ఏకగ్రీవ ఆమోదం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు నిధుల మంజూరుతో పాటు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్