జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు జనవరి 2వ తేదీ నుంచి పరీక్షలు ముగిసే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ తరగతులు ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు జరుగుతాయని, షెడ్యూలు ప్రకారం విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు.