సంగారెడ్డి: పోటీ ప్రపంచంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి

713చూసినవారు
సంగారెడ్డి: పోటీ ప్రపంచంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్రంలోని పరికరాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య తదితర అధికారులు పాల్గొన్నారు.