సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలం ఇందిరా నగర్ గ్రామ పంచాయతీలో తొలిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. గతంలో ఇందిరా నగర్, తండా ప్రజలు పెన్షన్ల కోసం మర్ది గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది, దీనితో వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడేవారు. సర్పంచ్ మర్క సంగన్న చొరవతో ఇకపై గ్రామ పంచాయతీలోనే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దీంతో ప్రజలు తమ గ్రామంలోనే పెన్షన్ పొందవచ్చని సర్పంచ్ తెలిపారు.