
బీఎస్ఎఫ్ కాన్వాయ్ బస్సుకు ప్రమాదం
జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం పీరా గ్రామం సమీపంలోని జాతీయ రహదారి-44 అప్ట్యూబ్ను అధికారులు మూసివేశారు. ట్రాఫిక్‌ను డౌన్‌ట్యూబ్ వైపు మళ్లించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




