సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని దామరగిద్ద గ్రామంలో రాష్ట్ర మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపిటిసి ముత్యాల సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఉప సర్పంచ్ చందా సుభాష్, మాజీ సర్పంచ్ ఆసం శంకర్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చలందరి మారుతి, మాజీ ఉప సర్పంచ్ కొత్తగాని సాయిలు, వార్డు సభ్యులు ఆసం పండరి, గైనీ శంకర్, ముత్యాల మచ్చేందర్, కుమ్మరి కృష్ణ, సీనియర్ నాయకులు కుమ్మరి శంకర్, ఎండి మైముద్, సుగర్ల విష్ణు, వద్ద శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.