సంగారెడ్డి జిల్లా, నాగల్ గిద్ద (మం) మోర్గి తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో బుధవారం విద్యార్థుల సాధారణ జ్ఞానం, ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు క్విజ్, స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి, క్విజ్, స్పెల్లింగ్, వాక్య నిర్మాణం, సాధారణ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ టి సువర్ణ ఈ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి భాగయ్య, బి సాయికుమార్ పాల్గొన్నారు.