పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న వార్తల నేపథ్యంలో, మంగళవారం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు కనిపించాయి. కొన్ని బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టడంతో, వాహనదారులు ఇతర బంకుల వైపు పరుగులు తీశారు. అధికారులు పెట్రోల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపించింది.