సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగామలో విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గంజాయి సాగు కలకలం రేపింది. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు, సుమారు 600 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, 15 కిలోల ఎండు గంజాయిని, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి సాగులో ఓ స్వామీజీ హస్తం ఉన్నట్లు సమాచారం అందడంతో, ఎక్సైజ్ పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు.