సంగారెడ్డి: మున్సిపల్ బాబాయ్.. అబ్బాయ్ పోటీ

16చూసినవారు
సంగారెడ్డి: మున్సిపల్ బాబాయ్.. అబ్బాయ్ పోటీ
నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన బాబాయి, అబ్బాయి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ కుమార్ శెట్కార్ 8వ వార్డు నుంచి, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ శెట్కార్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వేర్వేరు వార్డుల్లో ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తున్న వీరి ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :