ఆందోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అప్పుల బాధతో మద్యానికి బానిసైన మహేష్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్టర్ కొనుగోలుకు అప్పు చేసి, నెలవారీ కిస్తీలు చెల్లించలేకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ పాండు తెలిపారు.