కల్హేర్‌ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన సంజీవరెడ్డి

3569చూసినవారు
కల్హేర్‌ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన సంజీవరెడ్డి
ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, సేవలు అందించే లక్ష్యంతో పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దారు. గతంలో కల్హేర్ పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరిన పాత భవనంలో కొనసాగడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో, ఖాళీగా ఉన్న పాత ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేసి, అన్ని వసతులతో పోలీస్ స్టేషన్‌గా అందుబాటులోకి తెచ్చినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. అనంతరం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్