
అమెరికా అక్కసు.. భారత్‌ను నిందిస్తూ యాడ్ (వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి ట్రంప్ యంత్రాంగం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక యాడ్ వీడియో విడుదల చేసింది. ఈ వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేస్తున్నాయని ఆరోపించింది. ఈ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారని విమర్శించింది.




