
బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.




