సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎస్సై శ్రీశైలం మాట్లాడుతూ, 0-5 సంవత్సరాల పిల్లలను పోలియో బారి నుండి రక్షించడానికి ఈ రెండు చుక్కలు ఎంతో దోహదపడతాయని, ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలను తప్పకుండా వేయించాలని సూచించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు.