సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. నారాయణఖేడ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 30 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ టెస్ట్ లు చేసుకోవాలని పేర్కొన్నారు. హైపర్ టెన్షన్ ఉన్నవారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరారు.