పట్టపగలు వెలుగుతున్న వీధి దీపాలు.. పట్టించుకోని అధికారులు

14చూసినవారు
పట్టపగలు వెలుగుతున్న వీధి దీపాలు.. పట్టించుకోని అధికారులు
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రమైన కల్హేర్ గ్రామపంచాయతీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రామంలోని ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన వీధి దీపం పట్టపగలు కూడా వెలుగుతూనే ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు లైటు ఆఫ్ చేయకపోవడంతో విద్యుత్ వృథాగా పోతోంది. టైమర్ లేదా స్విచ్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. ఒకవైపు విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే, మరోవైపు ఇలా రోజంతా దీపాలు వెలుగుతూ ఉండడం విమర్శలకు దారితీస్తోంది.

సంబంధిత పోస్ట్