కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.