రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ జాతీయ మాజ్దూర్ యూనియన్ (టీ జె యమ్ యు ) సంగారెడ్డి డిపో అధ్యక్షునిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ని నియమించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యకలాపాలు, ఎన్నికల నిర్వహణ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాల్లో తోపాజి అనంత కిషన్ తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూనియన్ నాయకులకు సూచించారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, యూనియన్ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.