పాఠశాల తెరిచే సమయానికి తాళం లేదు: ఉపాధ్యాయులపై గ్రామస్తుల ఆరోపణలు

2చూసినవారు
నాగల్ గిద్ద మండలంలోని ఉట్ పల్లి ఫాత్తు తండాలో పాఠశాల తెరిచే సమయానికి తాళం తీయకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, దీనిపై కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను అడగగా వారు సెలవులో ఉన్నారని సమాధానం చెప్పారని తెలిపారు. మండలంలోని పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందని, ఉపాధ్యాయులు కేవలం హాజరుకే వస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పై అధికారులు చర్యలు తీసుకోవాలని తాండవాసులు కోరుతున్నారు.