సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, కంగ్టి మండలంలోని ముర్కుంజాల్ గ్రామంలో బుధవారం సింగిల్ మోటార్ పనిచేయకపోవడంతో స్థానికులు నీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ వెంటనే స్పందించి మోటార్‌ను రిపేర్ చేయించారు. దీంతో నీటి సరఫరా పునరుద్ధరించబడటంతో స్థానికులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.