సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో నల్లవాగు ప్రాజెక్టులో నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కల్హేర్ మాజీ ZPTC నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కల్హేర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, రైతులకు నీళ్లు ఇవ్వండి" అంటూ ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. కుడి, ఎడమ కాలువల ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలకు, చెరువుల నింపుదలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.