
లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్
TG: హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రాయికోడ్ వద్ద టికెట్ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేయడంతో, ఆగ్రహించిన కండక్టర్, ప్రయాణికులు అతనిపై చెప్పులతో దాడి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాయికోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంచగొండి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




