జిల్లాలో ఈనెల 9వ తేదీ నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. 9, 10 తేదీల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు 50% చొప్పున హాజరుకావాలి. 11న లాంగ్వేజ్, 12న నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులు తమ కేంద్రాల్లో జరిగే శిక్షణకు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరుకావాలని సూచించారు.