ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంజోల్, జరాసంగం ప్రాంతాల్లో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. మహిళల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వంపై ఎస్సై పూలబాయ్ అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్ వాట్సాప్ నంబర్ (87126 56772)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.