జహీరాబాద్: జూలై 1న స్పాట్ అడ్మిషన్లు

3495చూసినవారు
జహీరాబాద్: జూలై 1న స్పాట్ అడ్మిషన్లు
మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాల బాలుర విభాగంలో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త రాజేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రవేశాలు జూలై 1న ఉదయం 10 గంటలకు మహేశ్వరం గేట్ బాయ్స్ స్కూల్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కోఆర్డినేటర్ కార్యాలయంలో నిర్వహించబడతాయి. ఎంపీసీ, బైపీసీ, సీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, వొకేషనల్ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్