నర్సాపూర్ ఎమ్మెల్యే అరెస్ట్.. మండలంలో 144 సెక్షన్

1563చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం ప్యారా నగర్, నల్లవల్లి వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనున్న సందర్భంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం స్థానికులు నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు మండలంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్