
కొండాపూర్: రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్
కొండాపూర్ లోని రేషన్ దుకాణాన్ని తహసిల్దార్ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం నిల్వలను పరిశీలించి, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


































