ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనతో బీసీలకు సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరుగుతుందని నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో సాయి కృష్ణ గార్డెన్ లో ముదిరాజ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంకల్ప భేరి సభకు ఆయన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.