
గొడవ పడుతూనే భర్తను పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేసిన భార్య
AP: కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్, ఈరమ్మల జంట విషాదాంతమైంది. 2013లో పెళ్లయిన ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే మనస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. 2019లో భార్య ఫిర్యాదుతో భర్తపై గృహహింస కేసు నమోదైంది. శనివారం రాత్రి జరిగిన తీవ్ర ఘర్షణలో భార్య ఈరమ్మ భర్త మహేష్‌ను పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు ఈరమ్మను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




