మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులకు నిరసనగా ఇస్నాపూర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, కేసీఆర్ పై కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే నోటీసులు పంపించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.