ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, హాస్టళ్ల పరిశుభ్రత, ఆహార నాణ్యత, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే బాగా చదవాలని ఆమె సూచించారు.