రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఈ నెల 5న,
కేటీఆర్ నేతృత్వంలోని కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తుండగా, భువనగిరి జిల్లా వీరా హోటల్ సమీపంలో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో గాయపడ్డారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి అయనను వారి నివాసంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.