సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ మయూరి నగర్ కాలనీలో ఉన్న స్కాలర్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన రంగోలి(ముగ్గుల) పోటీ కార్యక్రమంలో కార్పొరేటర్ బూరగడ్డ పుష్ప నగేష్ శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ముగ్గులు వేసిన విద్యార్థులకు బహమతులు, పూలమొక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.