సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ మయూరి నగర్ కాలనీలోని గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రంగోలి(ముగ్గుల) పోటీలను కార్పొరేటర్ బురుగడ్డ పుష్ప నగేష్ ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.