రామచంద్రపురం డివిజన్ సండే మార్కెట్ లో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్ అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. 10 మీటర్లకు తగ్గకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు, కాంట్రాక్టర్ కి కార్పొరేటర్ గురువారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కవలి నగేష్, మాజీ ఏఎంసి డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, మైనారిటీ అధ్యక్షులు హబీబ్, అధికారులు, తదితరులు ఉన్నారు.