సంగారెడ్డిలోని పోలీస్ లైన్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల చదువు తీరును ఆయన పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.