జిన్నారం గ్రామంలోని అక్కమ్మ చెరువు తూము చెత్తాచెదారంతో నిండిపోవడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు కలిసి సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. కంప్రెషన్ మిషన్ సహాయంతో తూము నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించారు. ఈ మిషన్ ఖర్చులను బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి భరించారు. ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించాలని రైతులు కోరుతున్నారు.