బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో (IDA Bollaram) బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో దట్టమైన నల్లటి పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.