బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

0చూసినవారు
బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో దట్టమైన నల్లటి పొగ వ్యాపించి, స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్