జిన్నారం: జాతరలో ఉచిత వైద్య శిబిరం

62చూసినవారు
జిన్నారం: జాతరలో ఉచిత వైద్య శిబిరం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి జాతర సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డాక్టర్ కోమలి ప్రారంభించారు. జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు అవసరమైన సాధారణ వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్