అంగన్వాడి విద్యతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని సిడిపిఓ జయరాం నాయక్ అన్నారు. గుమ్మడిదల లోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని చెప్పారు. మైత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కుమార్ మాజీ సర్పంచ్ తులసీదాస్ తో కలిసి చిన్నారులకు మెమెంటోలు అందజేశారు.